తెలంగాణ

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని టీఆర్‌ఎస్ ధ్వజమెత్తింది. శనివారం ఇక్కడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ టీ భానుప్రసాదరావు విలేఖర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ నేతలు అసూయతోనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి పథకాలను ప్రశంసిస్తూ వాటిని స్ఫూర్తిగా తీసుకుని తమ తమ రాష్ట్రాల్ల కూడా అమలు చేస్తామని చెబుతున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు ఏమీ కనిపించనట్లు నటిస్తూ, ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీకి తెలంగాణ రాష్ట్రం అన్నా, ప్రజలన్నా ఏ మాత్రం గౌరవం లేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, విభజన చట్టం ప్రకారం మనకు సంబంధించిన అంశాలను అమలు చేయడం వంటి వాటిపై ఏనాడూ మాట్లాడిన పాపాన పోని బీజేపీ నేతలు ఓట్ల కోసం రాష్ట్రంపై కపట ప్రేమ ఒలకపోస్తున్నారన్నారు. టీఆర్‌స్పభుత్వం రెండోసారి అదికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అసరా పెన్షన్లు రెట్టింపయ్యాయన్నారు. పెన్షన్లు పొందేందుకు వయోపరిమితిని 60 పరిమితిని 57 ఏళ్లకు తగ్గించిన విషయం విపక్షాలకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలు వారికి కనిపించడం లేదన్నారు. ఏ రకమైన ఎన్నికలు జరిగినా ప్రతిపక్షపార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తూ టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. బీజేపీ మహిళా నాయకురాలు మద్య నిషేధం చేయాలని దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహిళలపై అత్యాచారాలకు కారణాలేమిటో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఇక్కడ మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరివ్వాలనే సంకల్పంతో పలు ప్రాజెక్టులను చేపట్టి రీ డిజైనింగ్‌పై ప్రతిపక్ష పార్టీలు పనికి మాలిన విమర్శలు చేస్తున్నాయన్నారు.