తెలంగాణ

కేసీఆర్ తిరుగులేని నాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు 52 రోజుల సమ్మె చేసినా చెక్కుచెదరలేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం హత్య కేసులో ప్రజల ఆగ్రహాన్ని చవిచూసినా, నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో అంతవరకు ఉన్న చెడంతా తుడిచిపెట్టుకుపోయింది. దిశ కేసులో ప్రభుత్వం అనుసరించినవైఖరితో దేశ వ్యాప్తంగా మహిళల రక్షణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడున్న చట్టాలు బలహీనమైనవని, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా, లోక్‌సభ ఎన్నికల్లో ఖంగుతినే ఫలితాలు రుచి చూసినా జంకలేదు. 2019 సంవత్సరం తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు గడ్డుగానే గడిచింది. పరిపాలన పరంగా చెప్పుకోదగిన ఘన విజయాలు లేవు. ప్రభుత్వ పాలనలో మెరుపులు లేవు. ఆకర్షణీయమైన పథకాలు లేవు. ప్రజలు ఆసక్తిగా చర్చించుకునే అంశాలు లేవు. ప్రతి రంగంలో నిరాశనే. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందనే ముందుగానే ప్రకటించిన నేత కేసీఆర్. కేసీఆర్‌కు సమీప భవిష్యత్తులో గట్టి సవాలు విసిరే రాజకీయనాయకుడు ప్రతిపక్ష పార్టీల్లో లేకపోవడమే కేసీఆర్‌కు వరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలహీనంగా ఉండడమే కేసీఆర్ ఆయుధం. . టీఆర్‌ఎస్ మొదటి టర్మ్ పాలనతో పోల్చితే, రెండవ టర్మ్‌లో మొదటి . ఈ ఏడాది కేసీఆర్ దూకుడు తగ్గింది. ఏ అంశంపైన కూడా తొందరపడి నోరుజారి ప్రకటన చేయకుండా ఉండడం, అవసరమైనప్పుడే మాట్లాడడం, తాను చేయదలుచుకున్న పనిని చకాచకా చేసుకుంటూ పోవడం కేసీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. గత ఏడాది మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడు నెలల పాటు తనతో పాటు ఒక హోంశాఖమంత్రితో పాలన సాగించారు. ఆ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు. మెరుగైన పాలన అందించేందుకు మళ్లీ తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావును మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం మూతపడింది. కొత్త సచివాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సచివాలయాన్ని కూల్చివేసి 25 ఎకరాల భూమిలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా కొత్త భవనాలు నిర్మించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ శాఖలను ఇతర భవనాలకు తరలించారు. కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించినా, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రభావంతో సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్‌పార్టీ మూడు స్థానాల్లో గెలిచింది. కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందారు. ఇవేమీ కేసీఆర్ ఆధిపత్యాన్ని నిలువరించలేకపోయాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, జడ్పీపీ, ఎంపీపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయాలను సాధించింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకల వల్ల విద్యార్థినుల మరణించిన నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆర్టీసీ సమ్మె 52 రోజులు కొనసాగింది. సమ్మెను విరమించుకోని పక్షంలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తామని కూడా కేసీఆర్ హెచ్చరించారు. చివరకు తెలంగాణ ఉద్యమంలో తనకు అండగా నిలిచిన ఉద్యోగులందరినీ భేషరతుగా ఉద్యోగాల్లో చేర్చుకుని, సెప్టెంబర్ నెల జీతం కూడా ఇచ్చేశారు. ఆర్టీసి ఉద్యోగులను ప్రగతిభవన్‌కు పిలిపించుకుని వారితో కలిసి భోజనం చేశారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ అంతరంగం తొలిదశలో కఠిన వైఖరి అవలంభించినా, చివరకు అందరినీ కరుణించారు. అంతుచిక్కని రాజకీయ వ్యూహాలు అనుసరించే కేసీఆర్ ఆర్టీసీ సమ్మెకు ముగింపుపలికిన తీరును చూసి ప్రతిపక్ష పార్టీలు చతికిలపడ్డాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో వైరం ఉన్నా, రాష్ట్రంలో బీజేపీ నుంచి గట్టి సవాళ్లు ఎదురవుతున్నా, కేంద్రంతో మాత్రం కేసీఆర్ సఖ్యతతో ఉన్నారు. 370వ అధికరణ, త్రిపుల్ తలాక్ అంశంలో అనుకూలంగా టీఆర్‌ఎస్ సభ్యులు ఓట్లు వేశారు. తాజాగా పౌరసత్వం చట్టం సవరణ విషయంలో మైనారిటీల ఓట్ల దృష్ట్యా వ్యతిరేకంగా పార్టీ సభ్యులు ఓట్లు వేశారు. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షాతో కేసీఆర్ సత్సంబంధాలను కలిగి ఉండడం విశేషం. ఆంధ్ర పాలకుల వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వెనకబడి పోయిందని పదే పదే విమర్శలు చేసే కేసీఆర్ ఆంధ్రరాష్ట్ర సీఎం జగన్ చేత ఈ మధ్య అనేక సార్లు హేట్సాఫ్ అని ప్రశంసలు అందుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. ఇది మంచి పరిణామం. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ప్రస్తుతానికి సమిసిపోయాయి. సచివాలయంలోని ఏపి భవనాలను జగన్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. దిశ ఎన్‌కౌంటర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ వైఖరిని ఆంధ్ర అసెంబ్లీలో నిండు సభలో ఆ రాష్ట్ర సీఎం జగన్ రెండు సార్లు ఆకాశానికి ఎత్తేయడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు. ఆ పార్టీ విలీనమైనట్లు ఇప్పటికే స్పీకర్ ప్రకటించారు. అధికారంలోకి వస్తామని కలలు కన్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఐదుగురు సభ్యులు మిగిలారు. బీజేపీ నుంచి ఒక సభ్యుడు ఉన్నా, బడ్జెట్ రోజు కూడా ఆ ఎమ్మెల్యే సభకు రాలేకపోయారు. మజ్లిస్ పార్టీతో ప్రత్యక్ష పొత్తులేకపోయిననా వ్యూహాత్మక ఎత్తుగడలతో మైనారిటీలకు చేరువయ్యారు. వందకు పైగా ఎమ్మెల్యేలతో రాజకీయ భీమసేనుడిలా అవతరించిన కేసీఆర్‌కు సమీప భవిష్యత్తులో తెలంగాణలో రాజకీయంగా ఎదురులేదని చెప్పవచ్చును.