తెలంగాణ

ఆరోగ్య తెలంగాణ కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ఆరోగ్య తెలంగాణ సాధించి ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ అకుంఠిత దీక్షతో పనిచేస్తోందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఇక్కడ ఆయన ఆరవ తెలంగాణ రాష్ట్ర దంత వైద్యుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ అవతరిస్తే అభివృద్ధి ఉండదని చెప్పిన వారి నోళ్లు మూతపడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. గజ్వేల్ నుంచి ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఆర్థికాభివృద్ధి, మానవ సమాజాభివృద్ధి అనేవి రైలు పట్టాలు లాంటివన్నారు. శాస్ర్తియ విజ్ఞానాన్ని
మానవ కళ్యాణానికి మాత్రమే ఉపయోగించాలన్నారు. తెలంగాణ ఆరోగ్య రంగంలో నెంబర్ ఒన్ స్థానాన్ని సాధించేందుకు కృషి జరుగుతోందని అన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దంత వైద్య రంగంలో వస్తున్న తాజా వైద్య పరిశోధనలు ఆసక్తిని కలిగిస్తున్నాయన్నారు. గ్రామీణ పేదలకు ఉచిత సేవలు అందించాలన్నారు. ఆధునిక వైద్య ప్రమాణాలను పాటించాలన్నారు. కాళోజి నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీ కరుణాకర్ రెడ్డి, దంత వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ జగదీశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ పీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున దంతవైద్యులు సదస్సుకు హాజరయ్యారు.

*చిత్రం... సదస్సును ప్రారంభిస్తున్న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్