తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు కేసీఆర్ ప్రతిష్ట అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు తనకు, తన ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారు. గత ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయకేతనం ఎగురవేసిన టీఆర్‌ఎస్, ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తిరుగులేని మెజారిటీతో గెలిచి తన ప్రతిష్టను మరింత పెంచుకుంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అఖండ విజయంతో గెలిపించుకోవాలని కేసీఆర్ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి ఇటీవల జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు) ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా స్పష్టమైంది. 32 జడ్‌పీపీలకు మొత్తం జడ్‌పీపీ చైర్మన్ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుని తన కీర్తిని ఇనుమడింపజేసుకుంది.
మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన హవాను చూపించాలన్న లక్ష్యంతో కేసీఆర్ అవసరమైన ప్రణాళికను రూపొందించుకున్నారు. 2019 జూలైలోనే జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు కోర్టుల్లో కేసుల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఎన్నికల కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రస్తుతం వార్డుల పునర్విభజన జరుగుతోంది. అధికారికంగా పునర్విభజన కార్యక్రమం పూర్తయింది. ఈ అంశంలో అభ్యంతరాలను మున్సిపల్ కమిషనర్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాలను స్వీకరించి వెంటవెంటనే పరిష్కరిస్తున్నారు. డిసెంబర్ 18 తర్వాత ఈ వివరాలను ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా జనాభాను విభజిస్తారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఎన్నికల కమిషన్, మున్సిపల్ వ్యవహారాల శాఖ కలిసి పూర్తి చేస్తాయి. ఒక్కో వార్డులో 50 వరకు ఓట్లు అటు, ఇటుగా 1,200 మంది ఓటర్లు ఉండే లా చూస్తున్నారు. వార్డుల వారీగా జనాభా నిర్ణయం అయిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ తతంగం అంతా మరో పదిహేను, ఇరవై రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ నివేదికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందిస్తారు. అ తర్వాత ఎన్నికల నోటీస్, షెడ్యూల్ జారీ చేస్తారు. జనవరి రెండో వారంలో నోటీస్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజారిటీ చైర్మన్ పోస్టులు, మేయర్ పోస్టులను తమ పార్టీకి దక్కేలా కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు తెలిసింది.

*చిత్రం... ముఖ్యమంత్రి కేసీఆర్