రాష్ట్రీయం

గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొంటున్న ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రముఖులు గ్రిన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ గ్రిన్ ఛాలెంజ్‌ను స్వీకరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో మొక్కలను నాటిమరో ముగ్గురికి ఛాలేంజ్ విసిరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సైనా మాట్లాడుతూ మన పర్యావరణం పచ్చదనానికి చిహ్నం, ఐశ్వర్యానికి సంకేతమన్నారు. పర్యవరణంపై ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేస్తున్న ప్రభుత్వానికి అభినందనీయం అని తెలిపారు. సూర్యుని రంగు ఎర్రదనం, చీకటి రంగు నల్లదనం, ప్రకృతి రంగు పచ్చదనం, కానీ ఎంపీ సంతోష్ రంగు మంచితనం అని ఆమె తెలిపారు. డీసీపీ రమేశ్ విసిరిన గ్రీన్ ఛాలేంజ్‌ను స్వీకరించిన నైనా లాల్‌బహదూర్ స్టేడియంలో మొక్కలు నాటి మరో ముగ్గురు సుమన్ తల్వార్, సుబ్బరాజు, ట్రాన్స్‌పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునిల్ శర్మ, గవర్నర్ సునిల్ శర్మకు గ్రిన్ ఛాలేంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రిన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్స్ రాఘవ, కిషోర్ గౌడ్, జయభారతి, సౌమ్యరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డిపాల్గొన్నారు.

*చిత్రం...ఎల్‌బీ స్టేడియంలో మొక్కలు నాటుతున్న క్రీడాకారిణి నైనా జైస్వాల్, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి