తెలంగాణ

తెలంగాణ భవన్‌లో అధునాతన లైబ్రరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, ఈ ప్రాంత సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అభివృద్ధితో పాటు వివిధ రంగాలకు చెందిన సమగ్ర సమాచారంతో ఏర్పాటు చేసిన లైబ్రరీని తెలంగాణ రాష్ట్ర సమితి అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ భవన్ మొదటి అంతస్తు మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన అధునాతన లైబ్రరీని గురువారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. పుస్తకాల రూపంలోనే కాకుండా డిజిటలైజ్ చేసిన సమాచారాన్ని కూడా ఈ లైబ్రరీలో అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ గురించి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా ఈ లైబ్రరీలో తగిన సమాచారం అందుబాటులో ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీ్ధర్, రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు రామచందర్‌రావు, తెలంగాణ స్టేట్ బ్రూవరేజెస్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, ఉన్నత విద్యామండలి సభ్యుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలాఉండగా వివిధ కారణాల వల్ల మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు జీవిత బీమా చెక్కులను కూడా కేటీఆర్ అందజేశారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని, ఏ సమస్య వచ్చినా తీర్చడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
*చిత్రం...తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీని గురువారం ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్