క్రైమ్/లీగల్

విద్యుత్ తీగలతో చిరుత హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, డిసెంబర్ 11: విద్యుత్ తీగలను అమర్చి చిరుతపులిని హతమార్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బజార్‌హత్నూర్ మండలంలోని డెడ్రా అటవీ ప్రాంతంలోని గోసాయి, ఉమర్డబి గ్రామ శివారంలో మంగళవారం రాత్రి పంట పొలంలో కొందరు మాటువేసి విద్యుత్‌తీగలు అమర్చి చిరుతపులిని హతమార్చిన ఘటన కలకలం రేపింది. ఈ సమాచారం బుధవారం అటవీ అధికారులు, పోలీసులకు తెలియడంతో కేసును విచారించగా ఏడుగురు నిందితులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డిఎఫ్‌వో చంద్రశేఖర్ బుధవారం ఇచ్చోడ అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బజార్‌హత్నూర్ మండలంలోని చౌహన్ కిషన్, చౌహన్ నాందేవ్, కొడప కిషన్, సిడాం నాగోరావు, పెందూరి నాగేందర్, సోయం నాగేశ్వర్, మడావి సునిల్ వన్యప్రాణులను వేటాడి హతమారుస్తూ మాంసాన్ని విక్రయించే వారు. వీరిపై అటవీ శాఖ కార్యాలయంలో గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయ. అయితే ఇందులో చౌహన్ కిషన్, కొడప కిషన్ పరారీలో ఉండగా చౌహన్ నాందేవ్, సిడాం నాగోరావు, పెందూరి నాగేందర్, సోయం నాగేశ్వర్, మడావి సునిల్‌లను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన భీంపూర్, తాంసి, తలమడుగు, బజార్‌హత్నూర్ మండలాల్లోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనిని గ్రహించిన నిందితులు పంట పొలాల్లో విద్యుత్ తీగలను అమర్చగా ఈ విద్యుత్ తీగలకు తగిలి చిరుతపులి మరణించింది. మరణించిన చిరుత పులిని సంఘటనా దహనం చేయగా అటవీ శాఖ సిబ్బంది సమాచారాన్ని సేకరించి సంఘటనా స్థలానికి వెళ్ళగా చిరుతపులిని కాల్చివేసినట్టు ఆనవాళ్ళు బయటపడ్డాయి.
*చిత్రం... స్వాధీనపర్చుకున్న పులి చర్మం