తెలంగాణ

గోదారమ్మ పరవళ్ళతో సిరిసిల్లకు జల కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 11: కాళేశ్వరం జలాలతో సిరిసిల్ల పట్టణం జలకళను సంతరించుకుంది. మధ్య మానేరు నుంచి సిరిసిల్ల మానేరు వాగులోకి బ్యాక్ వాటర్ చేరడంతో వాగుకు జల కళ వచ్చింది. ఈ శుభతరుణంలో మంత్రి కె.తారకరామారావు ట్వీటర్ ద్వారా స్పందించారు. గోదారమ్మ పరవళ్ళతో రైతుల కళ్ళలో సంతోషం నిండిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘సిరిసిల్ల జల కళను సంతరించుకున్న తరుణంలో గోదారమ్మ పరవళ్ళతో రైతుల కళ్ళలో చెరగని సంతోషం నిండింది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు వేసిన జల బాటలు.. శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు బ్యాక్ వాటర్. సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా’ అంటూ కొన్ని ఫొటోలను కేటీఆర్ పోస్టు చేశారు.

*చిత్రం... జల కళతో సిరిసిల్ల మానేరు వాగు