తెలంగాణ

అద్భుత నిర్మాణం కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మారం, డిసెంబర్ 11: రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరమని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ ప్రశంసించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజీ-6 కింద నిర్మించిన నంది పంప్ హౌస్‌ను గవర్నర్ దంపతులు బుధవారం పరిశీలించారు. రోడ్డు మార్గం ద్వారా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి మేడారం 6వ ప్యాకేజీకి చేరుకున్న గవర్నర్ పంప్ హౌస్‌లో భాగంగా నిర్మించిన సర్జ్ఫుల్, పంప్‌హౌస్ పనులు, విద్యుత్ సబ్ స్టేషన్ పనులను పరిశీలించారు. నంది పంప్‌హౌస్‌లో మొత్తం ఏడు పంప్‌లను మోటార్లను ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని గాయత్రి పంప్ హౌస్‌కు తరలిస్తున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు గవర్నర్‌కు తెలిపారు. గుట్టపై గల నీటి డెలివరీ సిస్టమ్ వద్దకు చేరుకొని రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేసే విధానాన్ని గవర్నర్ పరిశీలించగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎంసీ నల్లా వెంకటేశ్వర్లు గవర్నర్‌కు ప్రాజెక్టు గురించి వివరించారు. విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌ను కూడా ఆమె పరిశీలించారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్‌కు ఘవెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట సెక్రటరీ సురేంద్ర మోహన్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎంసీ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ కె.నర్సింహామూర్తి, పెద్దపల్లి ఆర్‌డీఓ ఉపేందర్ రెడ్డి, రామగుండం సీపీ సత్యనారాయణ, పెద్దపల్లి డీసీపీ రవీందర్‌లు ఉన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పెద్దపల్లి ఎసీపీ హబీబ్‌ఖాన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

*చిత్రం... ప్రాజెక్టు 6వ ప్యాకేజీలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళిసై