తెలంగాణ

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుతో ప్రత్యేక గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్,డిసెంబర్ 11: దేశ చరిత్రలోనే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పారిశ్రామికంగా అగ్రభాగాన నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొరియా నుండి వచ్చిన యంగ్‌వన్ కంపెనీ చైర్మన్ కియాన్‌సూవ్ బృందంతో కలసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా టెక్స్‌లైట్ పార్క్ పరిసరాలను కొరియా బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. కొరియాకు చెందిన యంగ్‌వన్ కంపెనీ 290 ఎకరాల్లో సింథటిక్, జాకెట్‌లు, బూట్లు, ట్రాక్‌షూట్, ట్రెక్కింగ్ చేయడానికి వేసుకునే దుస్తుల తయారీ కంపెనీలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కంపెనీ సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో 8 యూనిట్లుగా కంపెనీని ప్రారంభించనుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి ఈ కంపెనీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని దయాకర్‌రావు అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణ క్రమంలో వ్యవసాయ బావులు, బోర్లు కోల్పోయిన రైతులకు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున మంజూరు చేసినట్టు దయాకర్‌రావు తెలిపారు. నష్టపరిహారం మంజూరీ కోసం ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి కృషిచేశారని ఆయన ప్రశంసించారు. అనంతరం పరకాల నియోజకవర్గం సంగెం మండలం రాంచంద్రాపురంలో రూ.5 కోట్లతో నిర్మించిన 80 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గృహలలబ్ధిదారులతో కలసి ఉత్సాహంగా గడిపారు. గృహ ప్రవేశ కార్యక్రమాల్లో యజమానులతో కలసి పాల్గొన్నారు. సంగెం మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌లను మంత్రి దయాకర్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడుతూ.. అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ప్రజలకు సంక్షేమ పథకాలను విరివిగా అందించడంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పారిశ్రామిక ప్రగతి దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి జిల్లా కలెక్టర్ హరితలతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
*చిత్రం... డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తున్న మంత్రి ఎర్రబెల్లి