తెలంగాణ

150 ఏళ్లనాటి చెట్టు సజీవ తరలింపునకు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,డిసెంబర్ 10: అది 150 ఏళ్లనాటి మహావృక్షం. ఒక్కదెబ్బతో చెట్టును కూల్చేసి పనిపూర్తి అయింది అనిపించుకోవచ్చు. కాని ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ చెట్టు విశిష్టతను చెప్పడంతో మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆ చెట్టును ఎలాగైనా బ్రతికించాలనుకున్నారు. యంత్రాల సహాయంతో దానిని తరలించాలని నిర్ణయంచుకున్నారు. మానుకోటలోని మార్వాడి బజార్‌లో మానుకోటకు చెందిన వ్యాపారస్థుడు ఎయిర్‌టెల్ శ్యాం ఇంటి ముందు రావి, వేప వృక్షాలు రెండు కలసి ఒకటిగా పెరిగాయ. వీటిని కూల్చివేయాల్సిన పరిస్థితిని తప్పించడానికి ఈ మహావృక్షాన్ని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మంగళవారం పరిశీలించారు. వృక్షాన్ని నరకకుండా వేరేచోట తిరిగి నాటేలా చర్యలు తీసుకోవడానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డేవిడ్‌ను వెంటబెట్టుకొని రాగి, వేప కలసి పెరిగిన ఆ పవిత్ర వృక్షానికి పూజలు నిర్వహించారు. తానే స్వయంగా పర్యవేక్షణ జరుపుతూ యంత్రాల సహాయంతో చెట్టును తరలించే పనిని కొబ్బరికాయ కొట్టిప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. చెట్టును సజీవంగా తరలించాలనే సంకల్పంతో పనిని ప్రారంభించామని విజయవంతంగా ఈ పని పూర్తి అయితే అంతకు మించిన ఆనందం తనకు మరోకటి లేదన్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే గొప్ప బహుమతి చెట్టు మాత్రమే అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వృక్షాలుగా పెంచాలని ఆయన అన్నారు.

చిత్రాలు.. 150 సంవత్సరాలనాటి చెట్టుకు పూజలు నిర్వహిస్తున్న మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
* చెట్టును సజీవంగా తరలించేందుకు సిద్ధమవుతున్న యంత్రాంగం