తెలంగాణ

గిరిజన గూడాల్లో వెలుగు నిండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, డిసెంబర్ 10: గిరిజన గూడాల్లో వెలుగులు నిండాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం భూపాలపల్లి పట్టణంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జనరిక్ మందుల దుకాణాన్ని ప్రారంభించారు. కాసేపు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడిన అనంతరం అక్కడి నుండి నేరుగా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బోడగూడెం గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను గ్రామస్తులు గిరిజన సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. మొదట బోడగూడెంలోని లక్ష్మీమల్లు ఇంటికి వెళ్లి వారి స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు సంస్కృతి సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న వసతులు, సౌకర్యాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడిన అంశాలను కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఇంగ్లీష్‌లో గవర్నర్‌కు అనువాదిస్త్తూ తెలపడంతో ఆమె ఎప్పటికప్పుడు గ్రామస్తులడిగిన సౌకర్యాలపై తక్షణమే స్పందిస్తూ వచ్చారు. బోడగూడెంలో గవర్నర్ ఎంతో ఉత్సాహంగా గిరిజన మహిళలతో మమేకమయ్యారు. స్థానికంగా కుళాయిని ప్రారంభించిన గవర్నర్ ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్న గిరిజన యువతి వనిత గ్రామ సమస్యలతో పాటు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను లిఖితపూర్వకంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా గవర్నర్ వెంటనే స్పందిస్తూ వనితకు ఏఎన్‌ఎంగా ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు వేదికపైనే ఆమెకు ధ్రువపత్రాన్ని అందజేశారు. బోడగూడెం పర్యటన అనంతరం కాళేశ్వరానికి బయల్దేరిన గవర్నర్ నేరుగా గర్భాలయంలోకి వెళ్లి కాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గవర్నర్‌తో పాటు ప్రముఖులందరికీ ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయం పక్షాన గవర్నర్‌ను ఘనంగా సన్మానించారు. భోజన విరామం అనంతరం గవర్నర్ అక్కడి నుండి లక్ష్మీ పంపుహౌస్ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్లు వ్యూ పాయింట్ వద్ద మ్యాప్‌ను చూపిస్తూ గవర్నర్‌కు ప్రాజెక్టు నిర్మాణాలపై వివరించారు. ప్రాజెక్టు సందర్శన సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీపాటిల్ ఆధ్వర్యంలో గవర్నర్‌కు గౌరవ వందనం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, జడ్పీఛైర్మన్ జక్కు శ్రీహర్షిణి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆన్కారి భవానీప్రకాష్, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, సర్పంచు నిట్టురి శేఖర్, ఎంపీటీసీలు జాడి మహేశ్వరీ, విజయలక్ష్మీ, తోట జనార్ధన్, ఉప సర్పంచు నాయిని శ్రీనివాస్, తెరాస మండల అధ్యక్షులు డోలి అర్జయ్య, మహిళ అధ్యక్షురాలు రత్నసౌజన్యరెడ్డి, జిల్లా అధికారులు నాయకులు పాల్గొన్నారు.
*చిత్రం...కాళేశ్వరంలో పంపుహౌస్ వద్ద గవర్నర్ తమిళిసైతో అధికారుల బృందం