తెలంగాణ

పోరాడకుండా మతోన్మాదానికి అడ్డుకట్ట వేయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: సరళీకరణ విధానాలపై పోరాడకుండా మతోన్మాదానికి అడ్డుకట్టవేయలేమని సీపీఐఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఈ రెండింటికీ లింకుందని ఆయన పేర్కొన్నారు.
సరళీకరణపై పోరాడినపుడే ప్రజల్లో పూర్తిస్థాయి లౌకిక ఐక్యత సాధించవచ్చని తెలిపారు. మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా సాంస్కృతిక రంగంలోనూ పొరాటాలకు రూపకల్పన చేయాలని సూచించారు. రెండు రోజుల పాటు జరిగే సీపీఐ ఎం విస్తృత స్థాయి సమావేశాలు మంగళవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభమైన సమావేశానికి పార్టీ కేంద్ర సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టీ జ్యోతి, బీ వెంకట్, ఎం సాయిబాబు, జాన్‌వెస్లి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు మిగతా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న రాజకీయ పరిస్థితులు సొదాహరణంగా వివరించారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం మరింతగా బలపడిందని అన్నారు. ఇందుకు రాజ్యాంగ యంత్రాగాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. లౌకిక వ్యవస్థ పునరుద్ధరణకు వీలు లేని పరిస్థితులను కల్పించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా మరింత చురుకైన పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాలక పార్టీలన్నీ మొన్నటి వరకూ తమ స్వార్థానికి ఉపయోగించుకున్నాయని అన్నారు. దేశాన్ని అత్యధిక కాలం పాటు పాలించిన కాంగ్రెస్ కూడా ఈ అంశంలో రాజకీయ ఊగిసలాట ధోరణిని ప్రదర్శించిందని అన్నారు. ఆర్టికల్ 370, 35(ఏ)ను ఒక్క కలం పోటుతో రద్దుచేయడం ద్వారా బీజేపీ ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిందని అన్నారు. శబరిమల విషయంలోనూ బీజేపీ ఇదే రకమైన పద్ధతులను అనుసరిస్తోందని పేర్కొన్నారు. అక్కడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. హిందీ, హిందూ , హిందుస్థాన్ నినాదాల ద్వారా తమ భావజాలాన్ని మరింతగా ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో 53 రోజుల పాటు కొనసాగిన ఆర్టీసీ సమ్మె కార్మిక వర్గానికి ఒక దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు.
*చిత్రం... విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవుసలు