తెలంగాణ

లాజిస్టిక్స్ రంగంలో అపార అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేయడలో కీలక భూమికను పోషిస్తున్న లాజిస్టిక్స్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని లాజిస్టిక్స్ స్కిల్స్ కౌన్సిల్ చైర్మన్ కెప్టెన్ రామానుజన్ చెప్పారు. గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, ఎల్‌ఎస్‌సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భారతదేశం లాజిస్టిక్స్ పరిశ్రమ వృద్ధి, భావితరాలకు ఉపాధి అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టి ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాజిస్టిక్స్ రంగం వేగంగా విస్తరిస్తోందని, 2020 నాటికి 20 బిలియన్ డాలర్లు చేరుకుంటుందని జోస్యం చెప్పారు. ఇంతగా వృద్ధి చెందుతున్న రంగంలోకి అపార అవకాశాలు ఒడిసి పట్టుకోవాలనే లక్ష్యంగా ఎల్‌ఎస్‌సీని ఆరంభించామని అన్నారు. 75 రకాల ఉద్యోగ అవకాశాలున్న ఈ రంగానికి సుశిక్షితులైన నిపుణులను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గోదాముల నిర్మాణాలు పెరగడం, పునర్ వినియోగ ప్యాకింగ్ సామగ్రీ, ఓడరేవులు పెరగడం, వాటిని అనుసంథానించే లక్ష్యంతో చేపడుతున్న సాగరమాల, ఉడాన్ పథకం ద్వారా ప్రాంతీయ విమానాశ్రయాలు అనుసంథానం , కొరియర్ సర్వీసులు, ఈ కామర్స్, రైల్ లాజిస్టిక్స్, అంతర్గత జల రవాణా వంటి వన్నీ లాజిస్టిక్స్ రంగం ఎదుగుదలకు ఊతమిస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే బీబీఏ లాజిస్టిక్స్, బీఎంఎస్ ఏవియేషన్, ఎయిర్ కార్గో కోర్సులను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. వాటిని గీతం బిజినెస్ స్కూల్‌లో నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పిరు. ఈ కార్యక్రమంలో అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, కెప్టెన్ రామానుజన్, ప్రొఫెసర్ గణేషన్, ప్రొఫెసర్ గాయత్రి, డీవీవీఎస్‌ఆర్ వర్మ, ప్రొఫెసర్ ఏ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.