తెలంగాణ

ఏఐసీటీఈ రీజనల్ కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కోర్సుల అనుమతులు, ఇతర పర్యవేక్షణ వ్యవహాలను చూసేందుకు ఎఐసీటీఈ హైదరాబాద్‌లో సౌత్‌సెంట్రల్ రీజనల్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు వ్యవహరిస్తారు. కమిటీలో ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణారావుతో పాటు ఆంధ్రా యూనివర్శిటీ ఐఐఎం డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్, కాకినాడ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉంటారు. సిఐఐ డైరెక్టర్ సుభాజిత్ సహా, సీఐఐ డైరెక్టర్ షేక్ సమియుద్దీన్, కాకతీయ యూనివర్శిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ చంద్రకాంత్ కొకాటే , నల్సార్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ విద్యాధర్‌రెడ్డి, బీఏటీ డైరెక్టర్, ఉన్నత విద్యామండలి చైర్మన్, తెలుగు రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌లు, ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ వీసీ, ఎంహెచ్‌ఆర్‌డీ డిపార్టుమెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎఐసీటీఈ సలహాదారు, సభ్యులుగా ఉంటారు. రీజనల్ ఆఫీసర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. వీరంతా మూడేళ్ల పాటు కమిటీలో కొనసాగుతారు.
ఒడిశా సెంట్రల్ యూనివర్శిటీ వీసీ నియామకం
ఒడిసా సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన పొలిటికల్‌సైన్స్ ప్రొఫెసర్ ఐ రామసుబ్రమం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రా యూనివర్శిటీలో , సెంట్రల్ యూనివర్శిటీలో పనిచేసిన ఆయన వందకు పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ పాఠశాలకు వంద మాడ్యూల్స్‌ను రచించారు.
ఎమ్సెట్‌లో 65,565 సీట్లు
తెలంగాణలో వివిధ కోర్సుల్లో ఉన్న సీట్లను ఉన్నత విద్యామండలి గుర్తించింది. తెలంగాణ ఇంజనీరింగ్ కోర్సుల్లో 65565 సీట్లు ఉండగా అందులో ఈ ఏడాది 46134 మంది చేరారు. బైపీసీ గ్రూప్‌లో 7908 సీట్లకు 7241 మంది, ఐసెట్‌లో 22,429 సీట్లకు 19277 మంది, ఈసెట్‌లో 24479 సీట్లకు 17,803 మంది చేరారు.
తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తూ గెజిట్
తెలంగాణలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా బుధవారం నాడు గెజిట్ విడుదల చేసింది.
బీబీనగర్‌లో ఎయిమ్స్ నెలకోల్పనున్నట్టు గతంలో లోక్‌సభలో అప్పటి కేంద్ర మంత్రి జైట్లి ప్రకటించారు. అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగిన కేంద్రం ఎట్టకేలకు గెజిట్ విడుదల చేసింది.