తెలంగాణ

హిందూధర్మానికి కేసీఆర్ ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హిందూ ధర్మానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెనుముప్పుగా తయారయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను మంటకలుపుతున్నారని ఆరోపించారు. యాదాద్రి మూల విరాట్‌కే భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పాత్రికేయులతోమాట్లాడుతూ యాదాద్రిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడం సంతోషదాయకమేనని అయక్కడ వరుస మహాపచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఏకంగా స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామినే ఉలితో చెక్కేశారని, ఆలయ ప్రాకార స్తంబాలపై ఆ మధ్య ఏకంగా సీఎం శిల్పాలనే చెక్కారని, బీజేపీ ఆందోళనతో వెనక్కు తగ్గారని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహుడు స్వయంభువు అని, అత్యంత శక్తిమంతుడని, పరమ పవిత్రమైన ఈ ఆలయంలో విగ్రహాన్ని తాకడమే పాపమైతే ఉలితో చెక్కడం, సెల్ఫీలు తీసుకోవడం మహాదారుణమని అన్నారు. ఆలయాన్ని పునరుద్ధరించే క్రమంలో భాగంగా గర్భగుడిని, మూలవిరాట్‌ను ఆంజనేయస్వామి ఆలయాన్ని ముట్టుకోబోమని సీఎం ప్రకటించారని ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే ఆలయాన్ని నిర్మిస్తామని పదే పదే చెప్పారని, కానీ ఆగమ శాస్త్ర నియమాలకు మహాపచారం జరుగుతోందని అన్నారు. కేసీఆర్ మరో ఘజనీ మహమ్మద్‌లా మారారని, యాదాద్రి పవిత్రతను చెడగొట్టి తాను దేవుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఎంతో శాంతరూపంలో ఉండే యాదాద్రి స్వామిని పునర్నిర్మాణంలో తమకు ఇష్టం వచ్చినట్టు ఉగ్రరూపానికి మార్చారని ఆరోపించారు. యాదాద్రి వంటి గొప్ప ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి సరైన ప్రణాళిక ప్రభుత్వం వద్ద లేదని, పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించడంలో ఏ మాత్రం అనుభవం లేని వారిని నియమించారని ఆరోపించారు. శైవాలయాల్లో మూల వరులను శుద్ధి చేసే సమయంలో ప్రధాన పూజారులు తప్ప ఎవరినీ అనుమతించరని, అలాంటిది సింధూరం మందంగా ఏర్పడిందని తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రెండువేల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాన్ని కేసీఆర్ నాశనం చేస్తున్నారని, యాదాద్రి అభివృద్ధి కంటే అక్కడ రియల్ ఎస్టేట్‌పైనే కేసీఆర్‌కు మక్కువ ఎక్కువగా ఉందని అన్నారు. గుడి నిర్మాణానికి ముందే యాదాద్రి చుట్టూ నేతలు పెద్ద ఎత్తున భూములను కొనుగోలుచేశారని, వాటి ధరలు పెంచుకోవడానికే ఈ వ్యవహారం నడుపుతున్నారని లక్ష్మణ్ అన్నారు.