తెలంగాణ

భారత్ బచావో ర్యాలీకి జన సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరగనున్న భారత్ బచావో సమావేశానికి వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చినట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా చెప్పారు. భారత్ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ఆయన టీపీసీసీ సీనియర్ నేతలతో బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో సమీక్షించారు. రాష్ట్రం నుంచి నాలుగు వేల మంది కార్యకర్తలు, నేతలు ఢిల్లీ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నుంచి తప్పనిసరిగా పది మంది నేతలు ఉండాలన్నారు. అనుబంధ సంఘాలకు చెందిన 23 కేటగిరీల నేతలు ఢిల్లీ ర్యాలీకి సమాయత్తమవుతున్నారని చెప్పరు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని కుంతియా
ధ్వజమెత్తారు. కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతోందన్నారు. రాష్ట్రంలో ‘దిశ’ కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సకాలంలో స్పందించకపోవడంపై ఆయన విమర్శించారు. మోదీ, కేసీఆర్‌లు రైతాంగ సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం మాటలకే పరిమితమయ్యారన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు స్వస్తి పలికి ప్రజాస్వామిక పాలన తెచ్చుకునేందుకు ప్రజలు సమాయత్తం కావాలన్నారు. ‘దిశ’ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్‌కు సమయం లేదా? అని ఆయన నిలదీశారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, కుసుమకుమార్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... గాంధీభవన్‌లో మాట్లాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా