తెలంగాణ

విత్తన చట్టం రూపకల్పనలో బహుళ జాతి సంస్థల హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 20: రైతుల సంక్షేమమే ధ్యేయం అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం 2004 ముసాయిదా ప్రతికి కొన్ని మార్పులు చేసి 2019 విత్తన చట్టం ముసాయిదాను ప్రజల ముందు పెట్టిందని, ఈ విత్తన చట్టం రూపొందించడంలో బహుళ జాతి సంస్థల ప్రమేయం ఉందని, బహుళ జాతి సంస్థల ప్రయోజనం కోసమే ఈ చట్టం రూపొందించినట్టుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం కిస్సాన్ ఖేత్ రాష్ట్ర కార్యవర్గ జిల్లా సమావేశం కాంగ్రెస్ భవన్‌లో జరిగింది. టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవినాష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్రం తొలిసారి 1966లో విత్తన చట్టం చేసి 1953లో దానికి సవరణలు చేసిందని గుర్తు చేశారు. తర్వాత కాలంలో సవరణలు మినహా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా జాతీయ స్థాయిలో సమగ్ర విత్తన చట్టం లేకుండా పోయిందన్నారు. 2002లో విత్తన విధానం వలన బహుళ జాతి కంపెనీల ప్రవేశం సులభంగా మారిందన్నారు. బీటీ పత్తివిత్త్తనాలలో వ్యవసాయం విపరీత మార్పులు చెందిందని, అయినా సరైన చట్టం లేకుండా పోయిందన్నారు. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల రైతుల ఒత్తిడి మేరకు తమ స్ధాయిలో మంచి చట్టం తీసుకురావాలని ప్రయత్నాలు చేసినా విత్తనాల కంపెనీల ఒత్తిడి వల్ల అది సాధ్యపడడం లేదన్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ విత్తనాలకు సంబంధించి జాతీయంగా, విదేశీపరంగా అనేక మార్పులు వచ్చాయన్నారు. ప్రైవేటు రంగంలో విత్తనాల కంపెనీలు విపరీత లాభాలను పొందుతున్నాయని అన్నారు. బహుళ జాతి విత్తనాల కంపెనీల గుత్త్ధాపత్యం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 6 పెద్ద కంపెనీలు ఇప్పటి మూడు కంపెనీలుగా మార్పు చెందాయని అన్నారు. విత్తనాలు, విష రసాయన వ్యాపారం జోడు గుర్రాలాగ వాడుకుంటున్నారని అన్నారు.
అనుకూల శాస్తవేత్తలు, అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో కంపెనీలు విపరీతంగా ఎదిగిపోతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా రైతులు మేలు కోరుకుంటే సుంకాలు విత్తన బిల్లులో పొందుపర్చాలని అన్నారు. ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో వ్యవసాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా విత్తనాలు నేరుగా సంస్థాగత వ్యాపార వ్యవస్థకు చేరేలా ప్రోత్సాహం కల్పించాలని అన్నారు.
*చిత్రం... హన్మకొండ కాంగ్రెస్ భవన్‌లో జరిగిన కిసాన్ ఖేత్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క