తెలంగాణ

సాగర్ ఆయకట్టులో చివరి ఎకరాకూ నీరందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 19: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న చివరి ఎకరా భూమి వరకు సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అంకెల గారడీతో కాకుండా అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తుంగతుర్తి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్‌లతో కలిసి ఎనె్నస్పీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 50ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజవరం మొదటి మేజర్‌కు నీళ్లందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయకట్టు రైతులకు రెండవ పంటకు నీరందిస్తామని సీఎం కేసీఆర్ హమీనిచ్చినందున అందుకు అనుగుణంగా అధికారులు కార్యచరణ చేపట్టాలని కోరారు. నీటి విడుదలపై అధికారులు గణంకాలు వివరిస్తుండగా జోక్యం చేసుకున్న మంత్రి గణాంకాలు చెప్పడం కాదని, రైతులకు పోలాలకు నీళ్లు వస్తున్నాయా, లేదా అన్నదే లెక్కగా భావించి పనిచేయాలన్నారు. ఈసారి వర్షాలు సంవృద్దిగా కురిసి ప్రాజెక్టులన్ని పొంగిపొర్లుతున్నందున చివరి వరకు నీళ్లు ఎందుకు చేరడం లేదో అధికారులు సమాధానమివ్వాలన్నారు. రాజవరం, పేరూరు వంటి మేజర్‌లతో కలిపి 27వేల ఎకరాలకు 26కిలోమీటర్లకు గాను 22 కిలోమీటర్‌ల వరకే నీరందించడం ఏమిటని ప్రశ్నించారు. నీటి లభ్యత, నిల్వలపై ఎప్పటికప్పుడుగా నివేదికలు అందించాలని కోరారు. గుర్తించిన ఆయకట్టుకు ఎట్టి పరిస్థితుల్లో నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే వేసవిలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ నీటిని వినియోగించుకోవాలన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చివరి భూములకు నీరందకపోవడానికి కారణాలను గుర్తించి వాటిని అధిగమించేలా మార్గాలను అనే్వషించాలన్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్షా చేపట్టనున్నందున అధికారులు సమగ్ర వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సంజీవరెడ్డితో పాటు ఎనె్నస్పీ అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...ఎనె్నస్పీ నీటి విడుదలపై మ్యాపును పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి