తెలంగాణ

తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ నసీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ నసీం నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులను అందుకున్న ఆమె, ఆ వెంటనే పూర్వ రిజిస్ట్రార్ డీ.బలరాములు నుండి బాధ్యతలు చేపట్టారు. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం బోధనా అనుభవం కలిగిన ప్రొఫెసర్ నసీం ఇదివరకు తె.యూలో పరిపాలనా బాధ్యతలు సైతం నిర్వర్తించారు. పరీక్షల నియంత్రణ అధికారిగా, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్ సెల్ విభాగానికి సంచాలకులుగా, సీడీసీ డీన్‌గా పలు పదవుల్లో కొనసాగారు. తె.యూకు నాక్ అక్రిడిటేషన్ రావడంలో, 2ఎఫ్, 12బీ సాధించంలో ప్రొఫెసర్ నసీం కీలకపాత్ర పోషించారు. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగానికి అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళికా సంఘ చైర్‌పర్సన్‌గా కూడా కొనసాగారు. ఆమె పనితీరును గుర్తించి రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఇన్‌చార్జ్ వీ.సీ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వీ.సీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నియమితులైన రిజిస్ట్రార్‌ను బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు.
*చిత్రం... పూర్వ రిజిస్ట్రార్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రొఫెసర్ నసీం