తెలంగాణ

ఆర్థిక మాంద్యం అధిగమించేందుకు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ఆర్థిక మాంద్యాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికతో ముందు కు సాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు
సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెలో సంఘవిద్రోహులు ఎవరూ లేరని పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును చూసిన తర్వాతైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని, అనవసర అభాండాలు వేయవద్దని పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్యను పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను దీటుగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం అనేది భారత్‌కే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉందని, అయినా అనేక రకాలుగా ఏ దేశంలో తీసుకోని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం చాలా తీసుకుందని అన్నారు. ఆర్థిక మాంద్యంపై చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పేద ప్రజలకు మూడు రూపాయిలకే కిలోబియ్యం అందిస్తోందని, పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మరుగుదొడ్ల నిర్మాణం, వంటగ్యాస్ పంపిణీ, ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయిల విలువైన వైద్య సేవలు అందిస్తోందని, రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక మద్దతు ఇస్తోందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు బ్యాంకుల ద్వారా రుణ వితరణ చేస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. విపక్షాలు నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని, జమ్మూకాశ్మీర్‌లో 70 ఏళ్ల రక్తపాతానికి నరేంద్ర మోదీ తెరదించారని అన్నారు. అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ కేంద్రం చట్టాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం దృష్టిలో లేదని ఆయన చెప్పారు.

*చిత్రం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి