తెలంగాణ

నేను అలా అనే్లదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ ఫిర్యాదుతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి అంతర్గత విచారణను చేపట్టాయి. అలాగే కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వివరణ కోరడంతో హుటాహుటిన ఆయన సోమవారం హైదరాబాద్ వచ్చి కలిశారు. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను ఎడిటింగ్ చేసి కట్ అండ్ ఫేస్ట్‌తో లీక్ చేసినట్టు కలెక్టర్ సీఎస్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. పూర్తి సంభాషణను తెప్పించుకొని పరిశీలించాలని సీఎస్‌ను ఆయన కోరినట్టు తెలిసింది. ఇలావుండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీతో కలెక్టర్ జరిపిన సంభాషణ సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి ప్రాథమికంగా అందజేసిన నివేదిక మేరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి కలెక్టర్ వివరణ కోరినట్టు తెలిసింది. ఇలావుండగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, టీఆర్‌ఎస్ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి ఓడిపోయినట్లు తెలిసిందే. ఆ తర్వాత
జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బండి సంజయ్ తన ఓటమిపై కోర్టును ఆశ్రయించగా కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా అయిన సర్ఫరాజ్ అహ్మద్‌తో బండి సంజయ్ ఫోన్లో మాట్లాడిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో రెండు, మూడు రోజుల నుంచి వైరల్ అయింది. ఇందులో కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, ఎన్నికల వ్యయ పరిమితికి మించి ఖర్చు చేసిన తన ఫిర్యాదుపై బండి సంజయ్ కలెక్టర్ వద్ద ప్రస్తావించగా సరైన సాక్ష్యాధారాలు ఉంటే గెలిచిన వ్యక్తిని డిస్ క్వాలిఫై చేయవచ్చని, ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని, దీనిపై పేపర్ క్లిప్పింగ్స్‌ను పంపిస్తానని కలెక్టర్ చెప్పడం వివాదాస్పదంగా మారింది. తనను డిస్ క్వాలిఫై చేయడానికి కుట్ర జరుగుతోందని, ఇందుకు కలెక్టర్, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణనే సాక్ష్యాధారమని మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, సీఎం కేసీఆర్ దృష్టికి కూడా ఈ అంశం వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సీఎంఓ నివేదిక కోరినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు (అప్పటికి మంత్రి కాలేదు) వ్యతిరేకంగా కలెక్టర్ ఓడిపోయిన అభ్యర్థికి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయమని సలహా ఎలా ఇస్తారని ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మొత్తమీద బీజేపీ ఎంపీ, కలెక్టర్, రాష్ట్ర మంత్రి ముగ్గురు కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్ సంభాషణ లీక్ ప్రస్తుతం బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

*కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ (ఫైల్)