తెలంగాణ

కేటీపీపీ మొదటి దశలో ముమ్మరంగా ఓవరాలింగ్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపురం, నవంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు సమీపంలో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీ మొదటి దశ వార్షిక మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 47 రోజుల క్రితం జెన్‌కో యాజమాన్యం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గిపోవడంతో ప్లాంటును అధికారికంగా నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైడల్ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండూంతో థర్మల్ ప్రాజెక్టులకు కొంత విరామం ప్రకటించారు. కేటీపీపీలో మొదటి దశ 500 మెగావాట్లు, రెండో దశ 600 మెగావాట్ల ప్లాంటు ఉండగా మొత్తం 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 47 రోజుల క్రితం 500 మెగావాట్ల ప్లాంటును నిలిపివేసి రెండోదశ 600 మెగావాట్ల ప్లాంటులో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఒక్కో సమయంలో 600 మెగావాట్లలో కూడా బ్యాక్‌డౌన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుండగా 500 మెగావాట్ల ప్లాంటు నిలిపివేసిన యాజమాన్యం ఈ సమయాన్ని వార్షిక మరమ్మతులకు ఉపయోగించుకుంటుంది. గత నెల రోజులుగా వార్షిక మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టర్బన్ జనరేటర్, బాయిలర్, ఎలక్ట్రికల్ విభాగాలలో వార్షిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. కేటీపీపీకి చెందిన 400 మంది కార్మికులు వార్షిక మరమ్మతుల్లో పాలుపంచుకుంటుండగా బయటి నుండి నిష్ణాతులైన కార్మికులను వంద మందిని ప్లాంటుకు రప్పించి మరమ్మతు పనులను కొనసాగిస్తున్నారు. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో వార్షిక మరమ్మతులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కేటీపీపీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మొదటి దశలో ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

*చిత్రం... మొదటి దశలో కొనసాగుతున్న మరమ్మతు పనులు, ముఖ్య విభాగాల్లో మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులు