తెలంగాణ

కేసీఆర్ ఘనతతోనే.. బీడు భూములు సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రంలో బీడు భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. రైతును రాజు చేయాలని లక్ష్యంగా టీఆర్‌ఎస్ సర్కార్ పనిచేస్తుందన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలు రుణ విముక్తి చేసిందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం రైతుమిత్ర యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుతో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ముఖ చిత్రమే వ్యవసాయ రంగమన్నారు. రైతులు లక్షాధికారులను మార్చి.. వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసేలా తెలంగాణ సర్కార్ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందన్నారు. వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తుండటంతో ప్రస్తుతం పలువురు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు పెద్దఎత్తున ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పామాయిల్ పంట కోసం సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కార్‌ను కోరిందన్నారు. దీంతో కేంద్ర సర్కార్ సర్వే నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 220 మండలాల్లో పామాయిల్ పంట సాగు చేయవచ్చని నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు వ్యవసాయం మంచి ఉపాధి వనరుగా మారుబోతుందన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ఎంచుకున్నట్టు పేర్కొన్నారు. సమీకృత వ్యవసాయ రంగంలో రైతులు కోళ్లు, గొర్రెలను పెంచుకొని అధిక ఆదాయం పొందాలన్నారు. నూనెగింజల ఉత్పత్తిని పెంచాలని కేంద్ర సర్కార్ నిర్ణయించటంతో రాష్ట్ర ప్రభుత్వం నూనె గింజల పంటకు అన్ని విధాలుగా మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విధానం అమలు చేయటంలో రైతు సమన్వయ సమితులు కీలక పాత్ర నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో వ్యవసాయ రంగంలో గొప్ప మార్పువచ్చిందన్నారు.
పాలమూరు ఘనత వారిద్దరిదే..
తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట నాటిన విత్తనమని.. తొలిదశ, మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాను సాగునీరు అందించి సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులకు దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. రైతుమిత్ర యాప్ ద్వారా సాంకేతిక సాగు సలహాలు అందించటం, ప్రభుత్వ పథకాలు రాయితీలు, సూచనలు, వ్యవసాయ అధికారులు తెలియజేస్తారన్నారు. ఈకార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రోజాశర్మ, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జ, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, యాదగిరిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, జేసీ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి