తెలంగాణ

అద్భుత కట్టడంగా దుర్గం చెరువు బ్రిడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు మీదుగా నిర్మిస్తున్న బ్రిడ్జి అద్భుత కట్టడంగా నిలుస్తుందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జిగా
అధునాతన టెక్నాలజీతో నిర్మించిన బ్రిడ్జి ఫొటోలను మంత్రి తన ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్ చేశారు. దుర్గం చెరువుపై అటునుంచి ఇటువరకు రెండువైపులా కలుపుతూ స్తంభాలు లేకుండా కేవలం తీగల ఆధారంతో నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల అనేక ఐటీ కారిడార్లకు అనుసంధానం కానుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎలా జరిగింది, రెండు వైపులా ఎలా కలిపింది వంటి అంశాలను కూలంకషంగా తెలియజేసే విధంగా నాలుగు ఫొటోలను మంత్రి పోస్ట్ చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ వ్యయంతో పూర్తిచేసిన దుర్గం చెరువుబ్రిడ్జి మున్ముందు పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్థి చెందడానికి, చెరువుకు ఇరువైపులా ప్రయాణం చేసే వారికి ఎంతో ఉపకరిస్తుందని ట్విట్టర్‌లో పలువురు మంత్రికి అభినందనలు తెలిపారు.

*చిత్రం... దుర్గం చెరువుపై సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జి