తెలంగాణ

తహశీల్దార్లకు ఊరట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏడాది కిందట సాధారణ ఎన్నికలకు ముందు తాత్కాలిక బదిలీలకు గురైన 378 మంది తహశీల్దార్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఎన్నికలకు ముందు సొంత జిల్లాల్లో నిర్వహించిన పాత పోస్టింగ్‌లకే మళ్లీ వీరిని బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే బదిలీ చేయడం వల్ల ప్రత్యామ్నాయం ఎలా? అని ఆలోచించకుండా వీరిని విధుల నుంచి రిలీవ్ చేయాలని కూడా కలెక్టర్లను సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఇటీవల సంచలనం సృష్టించిన
అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తర్వాత రెవెన్యూ ఉద్యోగులు, ముఖ్యంగా తహశీల్దార్లు రాష్టవ్య్రాప్తంగా ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు బదిలీ చేసిన తహశీల్దార్లను మళ్లీ వారి మునుపటి స్థానాలకు బదిలీ చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్లలో ఇదే మొదటిది. అక్టోబర్ 2018లో శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల సందర్భంగా తహశీల్దార్లను సామూహికంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. జోన్ 5లో 166 మంది, జోన్ 6లో 212 మంది తహశీల్దార్లను ఇతర జిల్లాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. వీరికి తాత్కాలిక పోస్టింగ్‌లుగా ఆర్డర్లు ఇచ్చింది. ఈ తాత్కాలిక బదిలీలకు గడువు అక్టోబర్ నాటికే ఏడాది పూర్తయింది. పైగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కూడా వచ్చే నెల డిసెంబర్ నాటికి ఏడాది దాటనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం తమను తాత్కాలికంగా బదిలీ చేసినా ఇంకా అక్కడే కొనసాగించడం పట్ల తహశీల్దార్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. తాత్కాలిక పోస్టింగుల్లోనే కొనసాగించడం వల్ల శారీరక, మానసిక వ్యధతో రెవెన్యూ ఉద్యోగులు కొందరు గుండెపోటుతో మృతి చెందడం, ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు కూడా జరిగాయి. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తహశీల్దార్లకు ఎట్టకేలకు తాత్కాలిక పోస్టింగ్‌ల నుంచి విముక్తి లభించింది. అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన తర్వాత రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ప్రధానంగా తమను తాత్కాలిక పోస్టింగ్‌లలో కొనసాగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్, మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి తహశీల్దార్లకు తాత్కాలిక పోస్టింగ్‌ల నుంచి విముక్తి కల్పించడం పట్ల తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వీ మమత, తహశీల్దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాఉండగా జోన్ 5, జోన్ 6 కలిపి మొత్తంగా 378 మంది తహశీల్దార్లను వారి సొంత జిల్లాల్లోని మునుపటి స్థానాలకే బదిలీ చేస్తున్నట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని, జాయిన్ చేసుకోవాలని కూడా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.