తెలంగాణ

బాలల సంరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: బాలల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపడుతామని, ఇందుకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాలల దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలలంతా మంచి పౌరులుగా, ప్రయోజకులుగా ఎదగాలని అన్నారు. రాష్ట్రంలోని బాలలందరికీ రక్షణ కవచంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి గర్బస్త శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వమే అందజేస్తున్నట్లు వివరించారు. ప్రతి మనిషి జీవితంలో బాల్యం అమూల్యమైందని, దాన్ని బాలలందరూ సద్వినియోగం చేసుకుని ప్రయోజకులుగా ఎదగాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం జువైనల్ జస్టిస్ యాక్టు 2015, బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, తప్పనిసరి వివాహాల నమోదు చట్టం 2002, బాలల ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం 2009, ప్రీనైటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్టు 1994, బాల కార్మికుల నిరోధక చట్టం 1986 వంటి చట్టాలను సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగమంతా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఖచ్చితంగా అమలు చేసేందుకు కట్టుబడి ఉందని వివరించారు. మరిన్ని సమర్థవంతమైన సేవలను అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్ మాట్లాడుతూ చిన్నారులందరికీ అనందమైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి చైల్డ్‌లైన్ పోస్టర్, శ్రామిక వికాస కేంద్ర గర్ల్స్ అలయన్స్, ఎండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చినన బి.వౌనిక, జి.మణిదీప్, బి.కౌముది, దీవెన, స్పూర్తిలకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం జరిగింది.
అనంతరం రవీంద్రభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి తిలకించి, వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెల్సుకున్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

*చిత్రం... బాలల దినోత్సవం కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్