తెలంగాణ

సమ న్యాయానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: దేశంలో సమ న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రాంతీయ అసమానతలు తొలగి జాతీయ ఆదాయం సమాన పంపిణీ జరుగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సర అంతర్జాతీయ కార్యనిర్వాహక అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 28 దేశాల నుండి 70 మంది అంతర్జాతీయ ప్రతినిధులు గత ఆరు వారాల ఇంటెన్సివ్ శిక్షణలో భారతీయ ఎంఎస్‌ఎంఈ అనుభవాన్ని అధ్యయనం చేశారు. శిక్షకులు అంతా భారతదేశ దృక్పథాలను అర్థం చేసుకునేలా శిక్షణ ఇచ్చిన అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని అన్నారు. ఎంఎస్‌ఎంఈ సంస్థల ద్వారా మహిళల సాధికారత , సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం, అభివృద్ధి, మైక్రో సంస్థలను ప్రొత్సహించడంపై ఆఫర్ చేస్తున్న కోర్సులు తదితరాలన్నీ ప్రస్తుత కాలానికి అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని మంత్రి కితాబిచ్చారు. గడచిన ఐదేళ్ల కాలం నుండి అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ప్రధాని నరేంద్రమోదీ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ఇందుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఎంఎస్‌ఎంఈ వంటి సంస్థలు నైపుణ్యాలను, మార్కెట్ల అవగాహనను మెరుగుపర్చడానికి
నిశ్శబ్దంగా నిరంతరం పనిచేస్తూ, ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు. శక్తివంతమైన , క్రియాశీలకమైన ఎంఎస్‌ఎంఈ రంగం దేశ ఆర్ధిక వ్యవస్థకు దోహదపడటం ద్వారా దేశ ప్రగతికి గట్టి పునాది వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఎంఎస్‌ఎంఈ రంగం తగినంత ఉపాధి అవకాశాలను కల్పించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. నైపుణ్యాలు విద్యలో ప్రాధమిక భాగంగా ఉండాలని పేర్కొన్న ఆయన, ప్రతి ఒక్కరూ ఒకటి లేదా ఎక్కువ రంగాల్లో నైపుణ్యాన్ని సాధించాలని సూచించారు. నైపుణ్యాలతోనే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వశాఖ డైరెక్టర్ హేమేంద్ర కే శర్మ, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి