తెలంగాణ

పీసీసీ నాకే ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వైదొలిగే పక్షంలో ఆ పదవిని తనకే ఇవ్వాలని, తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీకి పూర్తి వివరాలతో లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఎటువంటి షరతులు లేకుండా తనకు పదవి ఇవ్వాలన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. కాంగ్రెస్‌లో నియంతృత్వం ఉండదన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు సీఎం అయినా కార్యకర్తలకు నిలదీసే హక్కు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిని కూడా తప్పు చేస్తే పదవి నుంచి తొలగించే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విభేదాలను విస్మరించి సోనియా, రాహుల్ అడుగు జాడల్లో పార్టీ నడవాల్సిందేనన్నారు. ఎవరికి వారే హీరోలు అనుకుంటే కాంగ్రెస్ నడవదన్నారు. కాంగ్రెస్ దేశ భక్తి, ఐక్యతతో నడిచే పార్టీ అన్నారు. అన్ని మతాలు, కులాలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందన్నా రు. కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు హీరోలనుకుంటే ఈ పార్టీలో కుదరదన్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తే పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తెస్తానన్నారు. తాను బీజేపీ, టీఆర్‌స్, కాంగ్రెస్ మూడు పార్టీల్లో పనిచేశానన్నారు. అన్ని పార్టీలను తిరిగిన తనకు ఆయా పార్టీల బలబలాలు తెలుసన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందన్నారు. తనపై ఉన్న కేసుల వివరాలనూ బయోడేటాలో పొందుపరిచానని ఆయన పేర్కొన్నారు.
*చిత్రం... కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి