తెలంగాణ

రెవెన్యూ కార్యాలయాల్లో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర పోలీసుల సహకారంతో భద్రతను ఏర్పాటు చేయాలని రాష్ట్ర భూపరిపాలన విభాగం (సీసీఎల్‌ఏ) ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచడంతో పాటు అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. కలెక్టర్ల దగ్గర అందుబాటులో ఉన్న నిధులతో సీసీటీవీ, కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని, ఆ సమయంలో సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది.
*చిత్రం... హైదరాబాద్‌లో జరుగుతున్న కోటి దీపోత్సవంలో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి