తెలంగాణ

స్తంభించిన సర్కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గత ఏడాది ముందస్తు ఎన్నికల వల్ల కొంతకాలం ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆ తర్వాత శాసనసభ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్, పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల కోడ్. ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయం తరలింపు ఇలా ఏదో ఒక ప్రతిబంధంకంతో స్తంభించిన
పాలన. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమించాక పాలనను పట్టాలు ఎక్కిద్దామంటే కోర్టుల్లో కేసులతో ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్థితి. కొత్త సచివాలయ నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె, ఇలా దేనిపైనా నిర్ణయం తీసుకోకుండా కోర్టుల్లో కేసులు తేలకపోవడంతో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి. అన్ని ఎన్నికలు చకచకా పూర్తి కావడంతో చివరగా మున్సిపల్ ఎన్నికలను కూడా పూర్తిచేస్తే ఒక పని అయిపోతుందనుకుంటే దానికి కోర్టు బ్రేక్. ఫలితంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరంభమైన ముందస్తు ఎన్నికలు మొదలు తాజాగా మున్సిపల్ ఎన్నికల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి. ఇక మిగిలిన ఒక్క మున్సిపల్ ఎన్నికలను కూడా ముగించేస్తే పరిపాలనను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు కూడా. కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కేసులు కొన్ని కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో సీఎం ఆలోచన కార్యరూపం దాల్చకుండా పోయింది. కొంతకాలంపాటు ముందస్తు ఎన్నికల వల్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వల్ల పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అది కూడా పూర్తయ్యాక కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయం తరలింపుతో ప్రభుత్వ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఈ అంశం కూడా కోర్టు వివాదంలో చిక్కుకోవడంతో తాత్కాలిక సచివాలయం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరపలేని పరిస్థితి. ఇప్పటికీ ఏ మంత్రి చాంబర్ ఎక్కడుందో తెలియని అయోమయం. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అక్టోబర్ మధ్యలో శాసనసభను ఒకటి, రెండు రోజులు సమావేశపరిచి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఉహించని విధంగా అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగడం, ఈ అంశం కూడా కోర్టుకు ఎక్కడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని ఆర్థిక శాఖ కార్యదర్శి వరకు కోర్టు మెట్లు ఎక్కడం, దిగడంతోనే సరిపోయింది. ఈ సమ్మె అంశంపైనే సీఎంకు దాదాపు అనునిత్యం ఉన్నతాధికారులు, న్యాయనిపుణుల సమీక్షలతోనే సరిపోయింది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇతర బెంచీల వద్ద ఉన్న కేసులు కూడా వీగిపోతే ఎన్నికలు ముగియగానే రాష్టవ్య్రాప్తంగా పర్యటించి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించనున్నట్టు సీఎం చెప్పిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించనున్నట్టు సీఎం ప్రకటించారు. కానీ ఆ తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు, కోర్టు వివాదాలు చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి కూడా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దరిమిలా గత ఏడాది సెప్టెంబర్‌లో ముందస్తు ఎన్నికల ప్రక్రియతో మొదలుకొని తాజాగా ఆర్టీసీ సమ్మె వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన స్తంభించింది.