తెలంగాణ

ఆ కమిటీకి నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: ఆర్టీసీ సమ్మెపై ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. సమ్మె అంశం కార్మిక శాఖ కమిషనర్‌కు అప్పగించాలని సూచించింది. దాంతో ఉభయ పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను మాత్రం గురువారం నాడు విచారించనుంది. చర్చలతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇంతకాలం పేర్కొన్న హైకోర్టు అది సాధ్యం కాకపోవడంతో సమ్మె చట్టబద్ధతను తేలుస్తామని పేర్కొంది. సమ్మె వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. హైకోర్టు సూచించినట్టు ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ అవసరం లేదని, కార్మిక శాఖకు అప్పగిస్తే చూసుకుంటుందని సీఎస్ పేర్కొన్నారు. పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టంలో ఇలాంటి కమిటీ ప్రస్తావనే లేదని ఆయన వివరించారు. అలాంటపుడు కార్మిక శాఖ వద్దకు ఎందుకు వెళ్లలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా, కేసు హైకోర్టులో నడుస్తున్నందునే కార్మిక శాఖ (లేబర్)
కోర్టుకు తాము వెళ్లలేదని ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది. ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టేలా కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశించాలని హైకోర్టును కోరింది. కాగా, ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసే అధికారం హైకోర్టుకు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎస్మా ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని, కనుక సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే, సమ్మెను చట్టవిరుద్ధమని ఎలా చెబుతారని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఉన్నతస్థాయి కమిటీ వేస్తే సమ్మెపై పునరాలోచన చేసి 24 గంటల్లో తమ నిర్ణయం చెబుతామని సంఘాలు పేర్కొన్నా, బుధవారం హైకోర్టు నుండి ఎలాంటి నిర్ణయం రాలేదు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఈ సందర్భంగా ఏజీ మరోమారు ప్రస్తావించారు. ఎస్మాపై 2015లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆరు నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు జీవోను పొడిగిస్తారని అన్నారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన జీవో 180ని కూడా ఏజీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, ఆనాటి జీవో తెలంగాణకు వర్తించదని హైకోర్టు పేర్కొంది. పునర్విభజన చట్టం సెక్షన్-68 ప్రకారం పబ్లిక్ యుటిలిటీ సర్వీసులు ఎస్మా పరిధిలోకి వస్తాయని ఏజీ వాదనలు వినిపించారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్-3 ప్రకారం టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశామని ఏజీ వివరించారు. అయితే, సెక్షన్-47 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి దీనికి అవసరం లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, రాష్ట్ర రోడ్డు రవాణాపై సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని ఏజీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టీసీ చట్టం కేంద్రం చట్టంలో భాగమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.
*చిత్రం... హైకోర్టు ఎదుట బుధవారం మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు