తెలంగాణ

గిట్టుబాటుపై బేఫికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, నవంబర్ 12: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు గిట్టుబాటు ధర రాదనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీనిచ్చారు. మంగళవారం వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, ప్రతి రైతు చిరునవ్వుతో వ్యవసాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీ ఆర్ లక్ష్యమని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొచ్చే బాధ్యత రైతులదేనని, తెచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే పండిన పంటలన్నింటినీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని, పక్క రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పక్క రాష్ట్రాలలో తక్కువ ధరలకు పంటలను కొని మన వద్ద అమ్ముతున్న దళారీ వ్యవస్థను అడ్డుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. దీనిని అరికట్టెందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచామని అన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతు లాభ పడాలన్నదే ప్రభుత్వ ఆశయమని ఆయన అన్నారు. పండిన పంటలలో కేంద్రం 25 నుండి 30 శాతం మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నిర్ణయంతో సంబంధం లేకుండా 100 శాతం పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు. మార్కెట్‌లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి రైతులు మార్కెట్‌కు ధాన్యాన్ని తెచ్చి మార్కెట్‌లో కొనుగోలుకు ఇబ్బందులు పెట్టకుండా అధికారులు నియంత్రణ చర్యలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే 50 రోజులు మార్కెటింగ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. గ్రామాల వారీగా వేసిన పంటలు, వచ్చిన దిగుబడి వివరాలు వ్యవసాయ, రెవిన్యూ అధికారుల నుండి సేకరించి అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. రైతులు ఒకేసారి మూకుమ్మడిగా కొనుగోలు కేంద్రాల వద్దకు రాకుండా ప్రతి రోజు కొంతమంది వచ్చి విక్రయాలు చేసుకోవాలని, రైతు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనిమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రమేష్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు గట్టుయాదవ్, వాకిటిశ్రీ్ధర్, పాకనాటికృష్ణ, కాగితాల లక్ష్మినారాయణ, నందిమల్ల శ్యామ్, తిరుమల్, నాయకులు పరంజ్యోతి, బండారు కృష్ణ, గిరి, మురళీసాగర్, శ్రీనివాసులు, డానియెల్, శివ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి