తెలంగాణ

ఇక చాలు అనేంత వరకూ సూర్యాపేటకు గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 11: ఎస్సారెస్పీ రెండవదశ కింద సూర్యాపేట జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలు అన్ని ప్రాంతాలకు చేరేలా చూడాలని, అన్ని గ్రామాల్లోని చెర్వులను నింపి జిల్లా రైతాంగం ఇక చాలనేంత వరకు నీటి విడుదలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు. జిల్లాకు విడుదల అవుతున్న గోదావరి జలాల వినియోగంపై సోమవారం సీఎం కేసీఆర్ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో ఫోన్ ద్వారా సంభాషించి సమీక్షించారు. నీటి విడుదల ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు ఎస్సారెస్పీ రెండవదశ పరిధిలోని కాల్వలు, ఉప కాల్వలు, చెర్వులకు నీటి చేరికపై మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టు పరిధిలోని ఎన్ని చెర్వులు నిండిన విషయంపై ఆరా తీసిన సీఎం జిల్లాలోని అన్ని చెర్వులను నింపాలని ఆదేశించారు. జిల్లాకు సరిపోయేంత వరకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, నీటి కొరత లేనందున జిల్లా అవసరాలు తీరి చాలనేంత వరకు నీటి విడుదలను కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని అన్ని చెర్వులు నింపి రైతులందరికీ సరిపడా నీటిని అందించాలన్నదే తన లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రికి సూచించారు. అయితే గోదావరి జలాల విడుదల మంత్రి జగదీశ్‌రెడ్డి అభీష్టానికి అనుగుణంగా ఉంటుందని తేల్చి చెప్పారు. జిల్లాకు నీటిని అందించడం కోసం జగదీశ్‌రెడ్డి తీవ్రంగా శ్రమించారని, అందువల్ల ఆయన కోరినట్టుగా నీటి విడుదలను కొనసాగిస్తామన్నారు. నీటి విడుదల కొనసాగుతున్నందున కాల్వలకు మరమ్మతులు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని, అందుకు అనుగుణంగా వచ్చే వేసవిలో కాల్వకట్టలు, ఇతర పనుల మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించుకోవాలని మంత్రిని ఆదేశించారు.
*చిత్రం... సీఎం కేసీఆర్