తెలంగాణ

నాణ్యమైన ఎర్రజొన్న విత్తనాలే వాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ఎర్రజొన్నకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఎర్రజొన్న సాగు-సమస్య’లపై చర్చించేందుకు సంబంధిత అధికారులతో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం హాకాభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కంపెనీలతో అధికారికంగా ఎంఒయూ చేసుకున్న తర్వాతనే విత్తనోత్పత్తి చేయాలని రైతులకు సూచించారు. ఈ అంశంపై కింది స్థాయి అధికారులు రైతులకు స్పష్టంగా తెలియచేయాలని ఆదేశించారు. రైతులు-కంపెనీల మధ్య జరిగే ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఎర్రజొన్న ఎక్కువగా సాగుచేసే మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు వాస్తవపరిస్థితిని వివరించాలన్నారు. ఎర్రజొన్న పండే ప్రాంతాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆ యా ప్రాంతాల ఎమ్మెల్యేలతో కలిసి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...అధికారులతో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి