తెలంగాణ

పంటలకు కనీస మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణలోని రైతులందరికీ వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర తాత్కాలిక సచివాలయం (బూర్గుల రామకృష్ణారావు భవన్) నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సోమవారం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో రైతుల పంటలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో చత్తీస్‌గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను నుండి వరి, కందులు, పెసళ్లు, వేరుశనగ తదితర పంటల ఉత్పత్తులను దళారులు తెలంగాణ మార్కెట్లకు తరలించే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల రాష్ట్రంలోని సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్ద గట్టినిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలంపూరు, గద్వాల, నారాయణపేట, భైంసా, తాండూరు, భద్రాచలం, కొత్తగూడెం తదితర మార్కెట్లపై నిఘాపెట్టాలని మంత్రులు సూచించారు. జిల్లాల వారీగా గ్రామాల వారీగా పెసళ్లు, కందులు, సోయాబీన్, మినుములు తదితర పంటలను పండించిన రైతుల జాబితాలను జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లాకేంద్రాల్లోని మార్క్‌ఫెడ్ కార్యాలయాలకు అందించాలని సూచించారు. దాని ఆధారంగా రైతుల నుండి పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు వీలవుతుందన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రశీదులు అందించాలని సూచించారు.
ధాన్యం కొనుగోలుకు 3327 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 670 కేంద్రాలను ప్రారంభించామన్నారు. సీసీఐ ద్వారా 252 జిన్నింగ్ మిల్లులు, 102 వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారింభిస్తున్నామని మంత్రులు తెలిపారు. 14 చోట్ల పెసళ్ల కొనుగోలుకు, 35 కేంద్రాల్లో సోయాబీన్ కొనుగోలుకు ఏర్పాట్లు చేశామన్నారు. రైతుల వివరాలను పూర్తిగా సేకరించి కొనుగోళ్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. కందులు, వేరుసెనగ కొనుగోలుకు కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు.

*చిత్రం...జిల్లా యంత్రాంగాలతో మాట్లాడుతున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్