తెలంగాణ

అరెస్టులు అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ కార్మికులు, వామపక్షాల కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడులను సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నిర్వహించడానికి కదలివచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుష చర్యగా ఆయన అభివర్నించారు. కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలియచెప్పడానికి వచ్చిన వారిపై అకారణంగా లాఠీచార్జి చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అసంబద్ధమైన వాదనను లేవనెత్తడం సబబుకాదన్నారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో నిషేధిత మావోయిస్టు సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారని ప్రకటన చేశారన్నారు. ఇది ముమ్మాటికీ పచ్చి అబద్దమన్నారు. పోలీస్ లాఠీచార్జిలో కార్మికులు, పార్టీల కార్యకర్తలకు గాయాలైన అంశాలపై మీడియాలో కథనాలను సీపీఐ గుర్తు చేసుకోవాలన్నారు. పోలీసుల దాడులకు నిరసనగా సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ నిరసన ప్రదర్శనల్లో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. రేపు జేఏసీ కో కన్వీనర్లు నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నారని, అందుకు మద్దతుగా రాష్టవ్య్రాప్తంగా సీపీఐ శ్రేణులు సంఘీభావం తెలుపుతారని చెప్పారు.