తెలంగాణ

ఆస్ట్రేలియాలో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: పార్లమెంట్ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌కు ఇతర దేశాల్లో స్పందన వస్తోంది. సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ స్వీకరించి మొక్కలు నాటారు. నాగేందర్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను ఆస్ట్రేలియా డిప్యూటీ మినిస్టర్ జాసన్ వుడ్ స్వీకరించి మొక్కలు నాటారు. జాసన్‌వుడ్ వీడియో సందేశం పంపిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉత్తమమైందని శ్లాఘించారు. నాగేందర్‌రెడ్డి అందించిన మొక్కను జాసన్‌వుడ్ ఒక కార్యక్రమంలో స్వీకరించి ఆ మొక్కను ఆస్ట్రేలియాలో నాటారు.
*చిత్రం...టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ నుంచి మొక్కను అందుకొంటున్న ఆస్ట్రేలియా మంత్రి జాసన్‌వుడ్