తెలంగాణ

యువ ఆవిష్కర్త అశోక్‌ను అభినందించిన కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వరి కలుపును తీసే యంత్రాన్ని రూపొందించినందుకు యువ ఆవిష్కర్త అశోక్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇది వరి పొలాల నుంచి పెద్ద కలుపు మొక్కలను సులభంగా తొలగించేందుకు సహాయపడుతుంది. ప్రగతిభవన్‌లో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ ఫణీంద్ర సామ, యువ ఆవిష్కర్త అశోక్ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అశోక్‌కు పూర్తి సహాయం అందించాలని ఫణీంద్ర సామను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన 17 ఏళ్ల అశోక్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్‌సైనె్సస్ మంత్రిత్వశాఖ నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో మొదటి బహుమతి లభించింది. అశోక్ దేవరకొండ వొకేషనల్ కాలేజీలో అగ్రికల్చర్ కోర్సును చదువుతున్నాడు.
*చిత్రం...తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వరి కలుపును తీసే యంత్రాన్ని రూపొందించిన యువ ఆవిష్కర్త అశోక్‌ను అభినందిస్తున్న మంత్రి కేటీఆర్