తెలంగాణ

అన్ని వర్గాల ప్రజలూ అంగీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ నేతలు స్వాగతించారు. అన్నివర్గాల ప్రజలు తీర్పును అంగీకరించాలని పార్టీ నేతలు వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో పేర్కొన్నారు. అయోధ్య తీర్పుపై పార్టీ నేతలు తొందరపడి ప్రకటనలు చేయవద్దని జాతీయ పార్టీ చేసిన సూచనతో రాష్ట్రాల నేతలు కొంత సంయమనం పాటించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, గౌరవిస్తున్నామని వారు చెప్పారు. అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ దేశ ప్రజానీకపు మత విశ్వాసాలు, నమ్మకాలను గౌరవిస్తూ ఇచ్చిన తీర్పు అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు సాగిన న్యాయ ప్రక్రియ తర్వాత చివరి తీర్పు ఇపుడు వెలువడిందని, ఈ సుదీర్ఘ న్యాయ ప్రక్రియలో రామజన్మభూమికి సంబంధించిన అన్ని విషయాలూ, అంశాలనూ పరిశీలించారని, అన్ని పక్షాలు వినిపించిన వాదనల పరిశీలన కూడా జరిగిందని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ విచారణను కొనసాగించి సత్యం, న్యాయాన్ని వెల్లడించిన న్యాయమూర్తులు, వివిధ పక్షాల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులకు అనేక అభినందనలు అని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ ప్రయత్నంలో పాలుపంచుకున్న వారిని, బలిదానం చేసిన వారిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. తీర్పును సానుకూలమైన దృష్టితో స్వాగతించి , స్నేహానుసహృద్భావాలను పరిరక్షించడానికి ప్రభుత్వ స్థాయిలో అలాగే సమాజ స్థాయిలో కృషి చేసిన వారందరి ప్రయత్నాలనూ తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఎంతో సంయమనంతో తీర్పు కోసం ఎదురుచూసిన భారతీయ ప్రజానీకం కూడా అభినందనీయులని అన్నారు.
ఈ తీర్పు జయాపజయాలు దృష్టితో ఏ మాత్రం చూడకూడదని, సత్యం, న్యాయం కోసం సాగిన మధనం నుండి వెలువడిన నిర్ణయాన్ని సంపూర్ణ దేశపు ఏకాత్మత, బంధుభావాన్ని పెంపోందించేందిగా చూడాలని, అలాగే ఉపయోగించాలని పేర్కొన్నారు. చట్టబద్ధమైన రీతిలో సంయమనంతో సాత్వికమైన పద్ధతిలో తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేయాలని, దేశ ప్రజానీకాన్ని ఆయన కోరారు. ఈ తీర్పు నేపథ్యంలో వివాదాన్ని పూర్తిగా అంతం చేస్తూ ప్రభుత్వం తగిన చర్యలను వెంటనే తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.