తెలంగాణ

రెవెన్యూ సిబ్బందికి భద్రత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్రంలో రెవెన్యూ సిబ్బందికి పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డిమాండ్ చేసింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతం కుమార్, కార్యవర్గ సభ్యులు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. వివాదాస్పద భూములకు కూడా వెంటనే పట్టేదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలంటూ కొంత మంది బెదిరిస్తున్నారని తెలిపారు. రాజకీయ నాయకులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను తమపై రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిలో రెవెన్యూ సిబ్బందికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని, ఎక్కడైనా దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వ వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ కార్యాలయాల్లో కోట్లాది రూపాయల విలువైన రికార్డులు ఉంటాయని, వీటికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలని ట్రేసా నేతలు డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి సీసీఎల్‌ఏ (చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేన్) ను నియమించాలని, అన్ని స్థాయిలలోని రెవెన్యూ కార్యాలయాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ‘్ధరణి’ వెబ్‌సైట్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వెబ్‌లో అన్ని రకాల ఆప్షన్స్‌ను తహశీల్దార్ లాగిన్‌లోనే ఉంచాలని ట్రేసా నేతలు రవీందర్‌రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. రెవెన్యూలో సమస్యలను పరిష్కరించడం వల్ల రెవెన్యూ ఉద్యోగులపై ప్రజలకు సదభిప్రాయం కలుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న పార్ట్-బి కేసులకు సంబంధించి ప్రభుత్వం తగు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరారు.