తెలంగాణ

వివాదానికి భరత వాక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య వివాదానికి భరత వాక్యం పలకాలని, అభివృద్ధిపై దృష్టిసారించాలని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ విజ్ఞత కలిగిన సమాజం గతం మీద దృష్టి పెట్టదని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలన్నారు. ఒక స్థానిక సమస్యను జాతీయ సమస్యగా తయారు చేసుకుని మనం చేయాల్సిన పనుల నుంచి మన దృష్టిని మరల్చుకున్నామన్నారు.
ఈ స్వయంకృతాపరాథం వల్ల హింస, ప్రాణ నష్టం జరిగిందన్నారు. అయోధ్య వివాదాన్ని జాతీయ సమస్యగా మార్చడానికి స్వార్థ రాజకీయ పార్టీలు 70 శాతం కారణమైతే, మిగిలిన 30 శాతం పాపం ప్రజలను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న రెండు పక్షాల చాందస ధార్మిక సంస్థలదని , ప్రజలను ఆకర్షిచేందుకు విపరీత ప్రచారం చేసిన మీడియాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో కోర్టు తీర్పును స్వాగతించారు. మసీదు కోసం కోర్టు ఐదు ఎకరాలను కేటాయించడం హర్షణీయమన్నారు. మతాలకు, పార్టీలకు సంబంధంలేకుండా అందరూ దీనిని సమర్థించాలన్నారు. భారతదేశంలో అయోధ్య ఉన్నది వాస్తవమే, రాముడు పరిపాలించినది వాస్తవమేనన్నారు. హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల మాదిరిగా జీవించాలన్నారు. కాంగ్రెస్ నేత జీ నిరింజన్ మాట్లాడుతూ సుప్రీం తీర్పు ఇరువర్గాలకు గౌరవ ప్రదమన్నారు. ఈ స్ఫూర్తితో ఈ వివాదానికి శాశ్వతంగా తెరదించాలన్నారు.