తెలంగాణ

చలో ట్యాంక్‌బండ్ నిర్వహించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శనివారం చలో ట్యాంక్‌బండ్ నిర్వహించి తీరుతామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం విజయవంతం చేస్తామని ఆయన ప్రకటించారు. సమ్మెకు అన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయన్నారు. సమ్మె చేపట్టి శుక్రవారం నాటికి 35 రోజులు గడిచిపోయాయని ఆయన గుర్తు చేశారు. సంస్థలో పని చేస్తున్న 48వేల మంది కార్మికుల భవిష్యత్‌పై ప్రభుత్వ పెద్ద సీఎం రోజురోజుకూ మొండివైఖరి ప్రదర్శించడం దుర్మార్గమని అన్నారు. శనివారం చలో ట్యాంక్‌బండ్
కార్యక్రమంపై ప్రభుత్వం నిర్బంధాన్ని అమలు చేసి, నిర్వీర్యం చేసే ప్రయత్నానికి ఒడిగడుతున్నదని అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ నేతలు, వివిధ పార్టీల నాయకులతోపాటు కీలక కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 97 బస్ డిపోల జెఏసీ నేతల్లి శుక్రవారం ఉదయం నుంచే అరెస్టులు చేశారన్నారు. కార్మికుల ఇళ్లకు వెళ్ళి మరీ మహిళా కార్మికులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విభజన సమయంలో నిర్వహించిన మిలీనియం మార్చ్ తరహాలో చలో ట్యాంక్‌బండ్ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక కుటుంబాలు తరలివస్తున్నారన్నారు. అయితే, ముందస్తుగా కార్మికులను అరెస్టు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అరెస్టులపై కార్మికులు భయపడాల్సిన అవసరం లేదన్నాని చెప్పారు. ప్రభుత్వ తీరును జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కార్మికులపై పోలీసు దమనకాండ ఆపాలన్నారు. జిల్లాల నుంచి శుక్రవారం రాత్రికే కార్మికులు చేరుకోవాలని ఆయన సూచించారు. శనివారం నిర్వహించే చలో ట్యాంక్‌బండ్‌పై వివిధ మార్గాల్లో చేరుకోవాల్సి ఉంటుందన్నారు. కార్యాక్రమాన్ని విజయవంతం చేయడానికి జేఏసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
మీడియాకు నోఎంట్రీ
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ బస్‌భవన్‌లోకి మీడియాకు నోఎంట్రీ అంటూ నోటీసులు జారీ చేశారు. బస్‌భవన్‌కు వచ్చే ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టారు. అధికారులను కలవాలని ఎవరు వచ్చినా వారి ఐడెంటీ కార్డ్‌ను పరిశీలిస్తారు. ముందస్తుగా సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి వారి అనుమతి తీసుకున్నాక అనుమతి ఇస్తున్నారు. మరో పక్క శనివారం చలో ట్యాంక్ బండ్ నిర్వహించనున్న సందర్భంగా బస్ భవన్ వద్ద హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 97 బస్ డిపోల వద్ద భద్రతా బలగాలతో అధికారులు పర్యవేక్షించాలని పోలీస్ అధికారులు అదేశాలు జారీ చేసినట్లు సమాచారం.