తెలంగాణ

రైతును రాజును చేయడమే సీఎం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 8: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని, రైతును రాజును చేయడమే సీఏం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొల్లాపూర్‌లో వ్యవసాయ మార్కెట్‌యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు వ్యవసాయం పట్ల ముఖ్యంగా సాగునీటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వ్యవసాయమంటేనే భయపడేలా పరిస్థితులను కల్పించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత స్వయంగా రైతైన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ముందుగా వ్యవసాయానికి పూర్వవైభవం తేవాలని, రైతును రాజు చేయడంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో రైతుకు సంక్షేమం కోసం అనేక పథకాలను, వ్యవసాయాభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తునే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డిలాంటి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంతో నేడు బీడు భూములు సాగుభూములుగా మారాయన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, నిలువ చేసుకునేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో గోదాంలను నిర్మించారన్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తునే కొల్లాపూర్ మార్కెట్‌యార్డులో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. మార్కెట్‌యార్డు చైర్మన్ నరేందర్‌రెడ్డితోపాటు మిగతా పాలక మండలి సభ్యులను జిల్లా మార్కెటింగ్ అధికారి బాలమణి ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా కోటి రూపాయలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని, యో గా భవనాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ప్ర భుత్వవిప్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, జేసీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.