తెలంగాణ

వచ్చే ఏడాది భారత్‌లో ఉగ్రవాదంపై సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచానికి పెనుముప్పుగా తయారైన ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు అన్నీ కలిసి రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదంపై వచ్చే ఏడాది భారత్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో తొలిసారి అంతర్జాతీయ గడ్డపై జరిగిన సదస్సులో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే నిధులను అరికట్టాలి అని పేర్కొంటూ జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సులో 65 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. శాంతి భద్రతలకు, అభివృద్ధికి అతి పెద్ద పెనుముప్పుగా ఉగ్రవాదం తయారైందని కిషన్‌రెడ్డి అన్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అన్ని ప్రపంచ దేశాలు కూర్చుని మాట్లాడి ఉగ్రవాదం నిర్మూలనకు ఒడంబడికను రూపొందించుకోవాలని సూచించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ మార్గదర్శకాలని అన్ని దేశాలూ పాటించి, అక్రమ మార్గాల ద్వారా కరెన్సీ చలామణిని నిరోధించాలని, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని అన్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చే సంస్థలు, వ్యవస్థలపై నిఘాపెట్టి, వాటిని అదుపు చేయాలని ఆయన పేర్కొన్నారు. 2011లో ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టినా, ఆ తర్వాత కూడా ఆల్‌ఖైదా అనేక ఉగ్రవాద చర్యలకుపాల్పడిందని అన్నారు. అబు బకర్ బాగ్దాదీని మట్టుబెట్టినా ఐసిస్ బెడద సమసిపోలేదని చెప్పారు.
*చిత్రం...ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ. కిషన్‌రెడ్డి