తెలంగాణ

గిట్టుబాటు ధర కోసం రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, అక్టోబర్ 23: పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటంలేదని బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో కమీషన్ ఎజెంట్‌లు, హమాలీలు కలిసి దోపిడీ చేస్తున్నారని, అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారని బోయిన్‌పల్లి మార్కెట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. గోవర్దన్ రెడ్డి అనే రైతు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకోని కాల్చుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులతో చర్చించిన వారి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇవ్వటంతో రైతులు ధర్నాను విరమించారు. బుధవారం జరిగిన ఘటన సంచలనం రేపింది. రైతుల కథనం ప్రకారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా రైతులు పండించిన కూరగాయలను బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చారు. రైతులు 80 కిలోల బస్తాలను తెస్తుంటే 60 కిలోలు మాత్రమే తీసుకుంటామని కమీషన్ ఏజెంట్‌లు, హమాలీల చెప్పడం వివాదంగా నడుస్తుంది. బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బోయిన్‌పల్లి మార్కెట్‌కు సమీక్ష నిర్వహించటానికి ప్రిన్సిపల్ సెక్రటరీ పార్ధసారథితో కలిసి వచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డి మార్కెట్‌కు వస్తున్న విషయాన్ని రైతులు తెలుసుకొని చర్చించాలని కోరారు. కానీ, మార్కెట్‌లో పూర్తిగా కలియ తిరిగి తర్వాత శిక్షణలో ఉన్న రైతులు ఉన్నచోటుకు మంత్రి వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు.
రైతుల వద్దకు మంత్రి రాకపోవటంతో రైతులు ఒక్కసారిగా ప్రధాన గేటు ముందుకు చేరుకొని ధర్నాకు దిగారు. చాలా సమయం వరకు మంత్రి రాకపోవడంతో గోవర్దన్ రెడ్డి అనే రైతు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపైన పోసుకొని నిప్పంటించకున్నాడు. పోలీసులు జోక్యం చేసుకొని మంటలు చల్లార్చి వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులతో చర్చించి వెంటనే రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారు. మంత్రి వెంట మార్కెటింగ్ శాఖ అధికారి లక్ష్మీబాయి, బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి పద్మ హర్ష పాల్గొన్నారు.