తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రగతిభవన్‌లో బుధవారం మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల సంఘానికి తెలియజేయాలని సీఎం ఆదేశించారు.
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు
గత ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన వంటేరు ప్రతాప్‌రెడ్డిని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సీఎం నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన పదవీ కాలం రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. హోంశాఖ అదనపు డీజీపీగా రవిగుప్తాను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు హోంశాఖ అదనపు డీజీపీగా ఉన్న రాజీవ్ త్రివేదిని జైళ్లశాఖ అదనపు డీజిగా నియమించింది.
*చిత్రం... సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న వంటేరు ప్రతాప్‌రెడ్డి