తెలంగాణ

నాణ్యతలో రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: కొల్లూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ టౌన్ షిప్‌ను దేశంలోనే మాడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. పేదలకు నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికే ఆదర్శంగా కొల్లూరులో నిర్మించే ఇళ్లను తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఒకే చోట పేదల కోసం ఇళ్ల ప్రాజెక్టు లేదన్నారు. ఇప్పటికే పది రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కొల్లూర్ ఇళ్లను పరిశీలించి వెళ్లారన్నారు. నిర్మాణం పూర్తి అయిన కొల్లూర్ ఇళ్లను బుధవారం హైదరాబాద్
మేయర్ బొంతు రామ్మోహన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అధికారులతో అక్కడే మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొల్లూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన తర్వాత దేశం మొత్తం కచ్చితంగా ఇక్కడి టౌన్ షిప్ నమూనాను పరిశీలిస్తారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది పూర్తి అయితే ఇక్కడ నివసించే జనాభా ఒక మినీ మున్సిపాలిటీ తరహాలో ఉండబోతుందన్నారు. ఇక్కడే పాఠశాల, హాస్పిటల్, పార్కులు, మంచినీటి సదుపాయం, మురుగు నీటి శుద్ధి, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ తదితర అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. కొల్లూరు టౌన్ షిప్ క్లీన్ స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా రూపుదిద్దుకుంటుందన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతలో ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొల్లూర్‌లో 15,660 ఇళ్లను 117 బ్లాకుల వారీగా నిర్మిస్తున్నామన్నారు. దీనికి అదనంగా రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి వౌళిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

*చిత్రం... కొల్లూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ టౌన్ షిప్ పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్