తెలంగాణ

ఒంటరి వాళ్లం కాదు.. మా వెనుక 4 కోట్ల జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, అక్టోబర్ 22: ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలని, కోర్టు ఆదేశాలను గౌరవించి చర్చలకు ఇప్పటికైనా పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వాత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసి సమ్మె 18వ రోజుకు చేరుకున్న సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ‘్ధం...్ధం’, వంటావార్పు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి విపక్ష నేతలు హాజరై కార్మికులకు సంఘీభావంగా ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ గత్యంతరం లేని పరిస్థితిలోనే తాము సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ ప్రజలు, అన్ని పార్టీల నేతలు గ్రహించాలన్నారు. చర్చల ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించటంతో న్యాయం మనవైపే ఉందన్నారు. కార్మికులు ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలను గౌరవించి ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జన సమితి అద్యక్షుడుప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ ఆర్టీసి సమ్మె విషయంలో ప్రభుత్వ వాదనలన్నీ చట్టబద్దమైనవి కావన్నారు. ప్రభుత్వ వాదన అవగాహన రాహిత్యంగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారన్నారు. చర్చలు సఫలమైనా విఫలమైనా మళ్ళీ కొనసాగించవచ్చని, కొనసాగించాల్సిన భాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. చర్చలు జరపాలని కోర్టు ఆదేశించిన పట్టించుకోకపోవటం ఏమిటనీ ప్రశ్నించారు. రోజు రోజుకు సమ్మె ఉద్ధృతం అవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. కార్మికులు అధైర్య పడొద్దని, అంతిమ విజయం మనదేనని అన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ 50 వేల కార్మికులకు నాలుగు కోట్ల మంది ప్రజలు అండగా ఉన్నారన్నారు. ఆర్టీసీ కార్మికులతో గొడవ పెట్టుకోవడం కొరివితో తల గోక్కుంటున్నట్టేనని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మెగా మారకముందే మేల్కొవాలని హితవు పలికారు. కాగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడితో రాలేదన్నారు. అప్పట్లో ఆర్టీసి కార్మికుల సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. బీజేపి నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ జాగీరు కాదన్నారు. ఆర్టీసీ కార్మికులకు అనేక సందర్బాలలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నారని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో టీడీపి నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాగ్రెస్ నేతలు మదుయాష్కి, సంపత్‌కుమార్, రాములు నాయక్, సీపిఐ నేతలు చాడా వెంకట్ రెడ్డి, సీపీఎం నేతలు డీజీ నర్సిహ్మారావు, న్యూడెమాక్రసి నాయకురాలు ఇందిర, జేఏసి నేతలు వి.ఎస్ రావు, రాజిరెడ్డి, పివోడబ్ల్యూ సంధ్య తదితరులు హాజరయ్యారు.
*చిత్రం... హైదరాబాద్ జూబ్లీ బస్టాండు ఆవరణలో మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులు, హాజరైన వివిధ పార్టీల నాయకులు కోదండరామ్, వీ హనుమంతరావు, ఎల్. రమణ, చాడ వెంకటరెడ్డి తదితరులు