తెలంగాణ

బ్యాంకులను విలీనం చేస్తే ఆర్థిక వ్యవస్థ మరింత పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తే ఆర్ధిక వ్యవస్థ మరింత పతనం అవుతుందని మంగళవారం నాడు జరిగిన బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో వక్తలు అభిప్రాయపడ్డారు.
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి మంగళవారం నాడు కోఠీ సెంట్రల్‌బ్యాంకు ఆవరణలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన భారీ ధర్నాలో పలువురు నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా నినాదాలు చేశారు.
ధర్నాలో తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత నంద్యాల నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్, ఎఐటీయూసీ నేత టీ నరసింహన్, సీఐటీయూసీ నేత సాయిబాబా, బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధానకార్యదర్శి సీహెచ్ రాంబాబు, సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామయ్య, బ్యాంకు సంఘాల నేత శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల విలీనం దేశంలో సంచలన గందరగోళ తిరోగమన నిర్ణయమని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజలకు ఆర్ధిక రక్షణ కోసం ఆనాడు బ్యాంకుల జాతీయకరణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని, నేడు బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సి వస్తోందని అన్నారు. కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు మరింత దోపిడీ చేయడానికి మార్గం సుగమం చేయడానికి బ్యాంకుల విలీనానికి మోదీ కుట్రలు పన్నుతూ ప్రజలకు ఆర్ధిక రక్షణ లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రభుత్వ బ్యాంకుల నుండి కోట్ల మంది రైతులు ఐదు శాతం రుణాలు తీసుకుని తిరిగి సమయానికి చెల్లిస్తున్నారని, కానీ కార్పొరేట్ దిగ్గజాలు మాత్రం 90 శాతం రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నారని విమర్శించారు.
*చిత్రం... హైదరాబాద్‌లోని కోఠిలో మంగళవారం జరిగిన ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల ధర్నాలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి